మానవుడు సంఘజివి, అనితరసాధ్యుడు, నిరంతరాన్వేషి. విజ్ఞాన ఖని.
పూర్వం అంటే మానవుని ఆవిర్భావం జరిగాక, ఈ యుగాలు లేవు. యుగ కర్తలూ లేరు. విజ్ఞానమూ లేదు, కానీ ఈ భూమ్మీద అతని మనుగడ, నిరంతరం సాగుతూనే వచ్చింది. అన్వేషణలూ పెరిగాయి. అనుభవాలూ వచ్చాయి. కాలక్రమేణా అతని సంచారం వృధ్ధి చెందింది. అతనిలో నాగరికతకు బీజం ఏర్పడింది. ఆ తర్వాత అచంచల సృష్టికి ఆవిర్భావం జరిగింది. క్రమేణా యుగాలు, దిశలు, నిర్దేశాలు కాల ప్రమాణలూ తెలిసాయి. దీనికొక సాధికారత కావాలనుకున్నాడు. అప్పుడే విద్యా ప్రమాణ వ్యవస్థ ఏర్పడింది. దేవుని ప్రస్తావన వచ్చింది. భయ, భక్తులు తెలిసాయి. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ నిమిత్తం దేవతా అవతారాలు ఏర్పడ్డాయి. తత్ఫలితమే ఇతిహాస పురాణాలు లిఖించ బడ్డాయి. వేద ప్రామాణిక మైన విద్య గురించీ భారతీయ విద్యా వ్యవస్థ ప్రపంచానికే చాటి చెప్పే స్థితికి చేరుకుంది. వ్యాస మహర్షి మహాభారతం, వాల్మీకి రామాయణం సంస్కృత భాషలో గ్రంధస్థం చేయబడ్డాయి. రానురానూ అవి ప్రాక్రుత భాషలలోకి అనువదించ బడ్డాయి. ఇదుగో ఈ విధంగా మనకి తామ్రపత్రం, తాళ పత్రంతో చేసిన గ్రంధాలు వెలిసాయి. ఆతరువాత నవీన పద్ధతుల ద్వారా కాగితం ప్రాచుర్యంలోకి వచ్చింది.మొదటగా జానపద కధలు ప్రాంతీయమును బట్టి వెలుగులోకి వచ్చేయి. బుర్ర కధలు,హరికథలు,వీరగాధలు అన్ని ఇతిహాసాలని చిన్నకధలుగా ప్రజలకి చేరేవి.
ఒక కథ తమ నమ్మకమ్ ప్రకారం చూసిన వారికీ నిజం గాను,లేని వారికీ కట్టుకథ గాను అనిపిస్తుంది.అదే చరిత్ర అని చెప్పుకోవచ్చు
మానవుని మేధస్సుకు, ఆధునికీకరణకూ జత గూడింది. విజ్ఞానం మెరుగు పడింది. అప్పటికీ అన్నీ సంస్కృత భాషనే ప్రామాణికంగా తీసుకున్నాయి. పౌరాణిక, జానపద, సాంఘిక కథల ద్వారా, నాటి ఆచార వ్యవహారాలు, మనకు తెలిసాయి. ఆ తర్వాత మనిషి జీవన విధానంలో పెనుమార్పులు చోటుచేసుకున్నాయి. రాచరిక వ్యవస్థ ఓ దశలో ఎంతో ఉన్నత శిఖరాలకు చేరుకున్నప్పటికీ అనేక పోకడల ఫలితంగా క్రమేణా అది మరుగున పడిపోయింది. అదుగో అప్పుడే అలాంటి మహాత్తర అవకాశాన్ని అత్యంత లాఘవంగా తమ తెలివి తేటలతో అందిపుచ్చుకున్నారు ఆంగ్లేయులు. నెమ్మదిగా వ్యాపార నిమిత్తం మనదేశం లోకి జొరబడి, తర్వాత తీవ్రతరమై మనలను పాలించే దశకు చేరుకున్నారు. మన వ్యవస్థనీ, మన దేశంలోని అన్నిరంగాలనూ వరికానుగుణంగా మలచుకున్నారు.అప్పుడే వారి విద్యా విధానం మనమీద తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఆ ఫలితమే.. విదేశీ కథలైన గలీవర్ యాత్రలు, అరేబియన్ నైట్స్, అల్లావుద్దీన్ కథలు వంటి ఎన్నో కథాంశాలు మనకు తెలిసాయి. దీనిద్వారా ఆ దేశం సంస్కృతి, సంప్రదాయాలు, తీరుతెన్నులు, జీవన విధానాలు లాంటి ఎన్నో మాంచి విషయాలు మనకు తెలిసాయి.
నేటి పిల్లలకి ప్రశ్నలు ఎన్నో వున్నాయి.
పిల్లలకి సహజమైన కుతూహలం : ఇంగ్లీషులో myth అనే మాటని తెలుగులో పురాణ గాథ అనొచ్చు. పురాణ గాథలకి రెండు ప్రయోజనాలు ఉన్నాయి. మొదటి ప్రయోజనం: పిల్లలు కుతూహలంతో అడిగే, ఇబ్బంది పెట్టే, ప్రశ్నలకి తేలికగా సమాధానాలు చెప్పడానికి. ఏమిటా ప్రశ్నలు? ఈ ప్రపంచాన్ని ఎవ్వరు తయారుచేసేరు? ఎప్పుడు తయారుచేసేరు? ఈ ప్రపంచం ఎన్నాళ్ళు ఉంటుంది? మొట్టమొదట ఎవ్వరు పుట్టేరు? చచ్చిపోయిన తరువాత ఎక్కడకి వెళ్తాము? మొదలైనవి. రెండవ ప్రయోజనం: మనం ఉంటున్న సాంఘిక వ్యవస్థని, మన ఆచార వ్యవహారాలని సమర్ధించడం కొరకు. సనాతన కాలపు గ్రీసు దేశపు సమాజంలో దేవుళ్ళ గురించి, దేవతల గురించి, సాహసోపేతమైన ధీరుల గురించి, భయంకరమైన రాక్షసాకారాల గురించి, వికృతమైన చంపూ మానవులు (human-animal hybrids) గురించి ఎన్నెన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. తుఫానులు ఎందుకు వస్తున్నాయి? అగ్నిపర్వతాలు ఎందుకు పేలుతున్నాయి? భూకంపాలకి కారణం ఏమిటి? పూజలు, వ్రతాలు, మొదలైన కర్మకాండలు ఎందుకు చెయ్యాలి? మొదలైన ప్రశ్నలు అప్పుడే కాదు ఇప్పుడు కూడా అడుగుతున్నారు. వీటికి సమాధానాలు చెప్పడం కోసం పురాణ గాథలు పుట్టుకొచ్చాయి.
మనం చాలా శాంతస్వభావులం. అన్నిటినీ సానుకూల దృక్పధంతో ఆలోచించి, తెలుసుకుంటాం. అందుకే మనకు అన్నిదేశాల స్థితిగతులూ, ఆచార వ్యవహారాలూ పుస్తకాల రూపంలో గ్రంధస్థం చేయబడ్డవి మనకు లభ్యమైనాయి. వాటిద్వారా మనం ఎంతో విజ్ఞానాన్ని సంపాదించుకున్నాం. అంతర్జాతీయ మనస్తత్వాన్ని (International Mindedness )ఏర్పారుచుకున్నాం.
Attributes : గుణాకృతులు
విజ్ఞానంతో కూడిన ఆలోచనా సరళిని ఏర్పరుచుకుంటూ నిబద్ధతతో ధైర్యాన్ని పెంపొందించుకుంటూ, అందరినీ సమన్వయ పరుచుకొని, తగిన సంభాషణా చాతుర్యంతో, తెలుసుకున్నదాన్ని వివరించే విషయంలో విశాల మనస్తత్వం కలిగినప్పుడు ఎటువంటి ప్రభావం చూపినా, జాగ్రత్తగా మెలగడం నేర్చుకున్నాం.
అలాగే :
Attitudes : వైఖరులు :
ఎక్కువ ఆదుర్దా, ఆత్రుతలకు లోనుకకుండా, గౌరవ మర్యాద లను పాటిస్తూ, తగిన సామర్ధ్యన్ని, సహకారాన్ని, సృజనాత్మ కత తో ఏర్పరుచుకుంటూ, పొగడ్తలను, జాలిని, సానుభూతిని ఆశించకుండా, విధి విధానాలకు కట్టుబడి వుంటూ, సమైక్యతతో స్వతంత్రంగా ఎలా మెలగాలో నేర్చుకున్నాం.
ఇవన్నీ మనకు అందించిన విజ్ఞాన కార్ఖానాలు మన ఇతిహాసాలూ, గ్రంధాలూను, అంతేనా?? మన సంస్కృతిని దశదిశలా చాటి చెప్పేలా, ఇతర దేశాలు మనకు తలవంచి నమస్కారం చేసేలా మనల్ని మనం తీర్చి దిద్దుకున్నాం. ఇదంతా మన గ్రంధాల విజ్ఞానం ద్వారా మనకి మనం నేర్చుకున్న విజ్ఞాన సంపద.
ఒక మoచి పుస్తకం వందమంది మిత్రులతో సమానం.
కానీ ఒక మంచి స్నేహితుడు ఒక గ్రంధాలయంతో సమానం.
చిరిగిన చొక్కా అయినా తొడుక్కో.. కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో..
By : Sri valli Gavicherla